'కేసీఆర్‌ ఫ్రంట్‌ ఉద్దేశం ఇదే'

'కేసీఆర్‌ ఫ్రంట్‌ ఉద్దేశం ఇదే'

యూపీఏ భాగస్వామ్య పార్టీలను చీల్చాలన్నదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నం అని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి  అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లపాటు బీజేపీకి కేసీఆర్‌ మద్దతు ఇస్తూ వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఎన్‌డీఏలోని ఏ ఒక్క పార్టీతోనూ కేసీఆర్‌ సంప్రదింపులు జరపలేదని అన్నారు. ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తమకు ఇబ్బంది లేదన్న సురవరం.. బీజేపీ లేదా కాంగ్రెస్‌ మద్దలు లేకుండా అది సాధ్యమయ్యే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.