రాజకీయ పార్టీలకు ఇదే మా అపీల్‌: సురవరం

రాజకీయ పార్టీలకు ఇదే మా అపీల్‌: సురవరం

బీజేపీకి లేదా కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఐతే.. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసినా.. బీజేపీ లేదా కాంగ్రెస్‌ మద్దతు తప్పనిసరి అని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ హంగ్‌ ఏర్పడితే బీజేపీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలని కోరుతామని, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే చెప్తామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలకూ ఇదే తమ ప్రతిపాదన అని చెప్పారు. 

లౌకిక ప్రభుత్వ ఏర్పాటు చేయడంలోరాహుల్ గాంధీ విఫలమయ్యారన్న సురవరం.. ఎన్నికల తర్వాత జరిగే ప్రతిపక్షాల సమావేశానికి తమకు ఆహ్వానం రాలేదనని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా..? ఆయన సూచించే వారు ప్రధాని అవుతారా అన్న విషయంపై తమకు ఆసక్తి లేదన్నారు. ప్రధాని అయ్యే అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని.. ఐతే.. ఏ ప్రభుత్వం వచ్చినా తాము అందులో చేరబోమని స్పష్టం చేశారు.