నిజమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి !

నిజమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి !

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'సైరా'.  తొలి తెలుగు స్వాతంత్ర్య యోధుడిగా పేరొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.  ఈ సినిమా కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి చాలానే రీసెర్చ్ చేశారు.  స్వయంగా ఆయన  ఉయ్యాలవాడ కుటుంబీకులను కలిసి చాలా వివరాలు సేకరించారు.  

ఈరోజు నరసింహారెడ్డి వర్థంతి కావడంతో ఆయన్ను గుర్తుచేసుకుంటూ తాను సేకరించిన వివరాల్లోని ఒక ఫోటోను షేర్ చేశారు ఆయన.  ఆ ఫోటో నరసింహారెడ్డిది.  ఇన్నాళ్లు నరసింహారెడ్డిని విగ్రహాల్లో చూసిన ఈ తరం జనానికి ఈ ఫోటో ద్వారా అసలు నరసింహారెడ్డి రూపం ఎలా ఉండేదో స్పష్టంగా చూసే అవకాశం కలిగింది.  ఫోటోలో నరసింహారెడ్డి ఆరడుగుల ఎత్తు, మంచి శరీర ధారుడ్యం, అందమైన ముఖ వర్ఛస్సు కలిగి చాలా ఆకర్షణీయంగా వీరగాథల్లో చెప్పినట్టే ఉన్నారు.