సైరా దర్శకుడితో.. ప్రభాస్ సినిమా...!!

సైరా దర్శకుడితో.. ప్రభాస్ సినిమా...!!

ప్రభాస్ సాహో సినిమా ప్లాప్ టాక్ వచ్చినా.. వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోయింది.  ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు రాబట్టడంలో.. సాహో టీమ్ సైతం ఖుషి అయ్యింది.  ప్రస్తుతం ప్రభాస్ .. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు ప్రభాస్.  ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నది.  

ఇదిలా ఉంటె, ఈ సినిమా తరువాత ప్రభాస్ సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  సైరా సినిమా మేకింగ్ విధానం ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది.  చారిత్రాత్మక సినిమాను ఇప్పటి తరం ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చిత్రీకరించాడు సురేందర్ రెడ్డి.  ప్రభాస్ కోసం ఓ స్టైలిష్ ఎంటర్టైనర్ కథను దర్శకుడు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.  దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  అయితే, ఎప్పుడు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.