అరవింద్.. నాగ్ బాటలో... సురేష్ బాబు కూడా...!!

అరవింద్.. నాగ్ బాటలో... సురేష్ బాబు కూడా...!!

అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో సినిమాలు చేశారు.  అయితే ఇటీవలే దీనికి సంబందించిన మరో సంస్థను గీత ఆర్ట్స్ 2 పేరుతో స్థాపించి సినిమాలు తీస్తున్నారు.  ఈ బ్యానర్లో వచ్చిన సినిమాలు కూడా చాలా వరకు హిట్ కొట్టాయి. అటు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ కూడా ఆ సంస్థతో పాటు మనం ఎంటర్టైన్మెంట్ అనే మరో బ్యానర్ను స్థాపించి అందులో సినిమాలు చేస్తోంది.  

ఇప్పుడు ఇదే బాటలో సురేష్ బాబు కూడా పయనించబోతున్నాడు.  దీనికి కారణం ఫలక్ నామ దాస్.  ఈ సినిమాలో కంటెంట్ కంటే బూతు ఎక్కువగా ఉంది.  ఇలాంటి సినిమాలు ఇందులో తీయడం వలన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు ఉన్న పేరు పోతుందని చెప్పి... సురేష్ ప్రొడక్షన్స్ 2 అనే బ్యానర్ను స్థాపించారని తెలుస్తోంది.  ఈ బ్యానర్లో రానా తదితరులు నిర్మించే సినిమాలు ఉంటాయని తెలుస్తోంది.