కరెంట్ బిల్లులు కూడా కట్టలేకపోతున్నాం...సురేష్ బాబు సంచలనం

కరెంట్ బిల్లులు కూడా కట్టలేకపోతున్నాం...సురేష్ బాబు సంచలనం

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్థాపించిన ఈ సంస్థ నుండి ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. రామానాయుడు తరువాత ఆ సంస్థ బాధ్యతలు చూస్తున్న ఆయన పెద్ద తనయుడు సురేష్ బాబు ప్రస్తుత సినిమాల పరిస్థితి పై చేసిన కొన్ని కామెంట్స్ సంచలనంగా మారిపోయాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీసే నిర్మాతలు తగ్గిపోతున్నారని.. అసలు చిన్న సినిమాలకు లైఫ్ లేదని చెబుతున్నాడు ఈయన. అంతేకాదు తాను నిర్వహిస్తున్న థియేటర్స్‌కు జీతం సంగతి పక్కన పెడితే కనీసం కరెంట్ బిల్ కూడా కట్టలేని స్టేజ్‌లో ఉండటం తనకే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పుకొచ్చారాయన.

దీనికి కారణం అమేజాన్, నెట్ ఫ్లిక్స్ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం యువత రాక సినిమా పరిశ్రమలో బాగా పెరిగిందని, దానివలన భవిష్యత్తులో మరిన్ని గొప్ప గొప్ప సినిమాలు వచ్చే అవకాశం కానీ సినిమాలకు వస్తున్న ఎకానమీ మెల్లగా తగ్గిపోతుందని, దానికి కొంతవరకు పైరసీ వంటివి కారణం అయితే, ఒకింత ఎక్కువగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ కూడా కారణం అని ఆయన అన్నారు.  సినిమా రిలీజ్ అయి నెలరోజులు కూడా కాకముందే అదే సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో దర్శనం ఇవ్వడం వలన, ఇప్పుడు చూడకపోతే ఏమి, మరొక నెలరోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో హ్యాపీగా హెచ్ డి క్వాలిటీ సినిమాని హాయిగా ఇంట్లోనే కూర్చుని చూడొచ్చని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారని, అదే ఒక విధంగా సినిమాల కలెక్షన్స్ పై చావు దెబ్బకొడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు.