55 ఏళ్ళు పూర్తిచేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్ !

55 ఏళ్ళు పూర్తిచేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్ !

 

తెలుగు చిత్ర పరిశ్రమలోని ఉత్తమమైన నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. డి. రామానాయుడు స్థాపించిన ఈ సంస్థ ఇప్పటికే 120కి పైగా చిత్రాలను నిర్మించింది.  ఈ సంస్థ నుండి మొదటగా ఇదే మే 21వ తేదీన ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన 'రాముడు - భీముడు' చిత్రం విడుదలై 55 ఏళ్ళు పూర్తైంది.  గడిచిన ఐదున్నర దశాబ్దాలలో ఈ సంస్థ శ్రీకృష్ణ తులాభారం, ప్రేమ్ నగర్, సెక్రెటరీ, దేవత, మాంగల్య బలం, బొబ్బిలి  రాజా, కూలీ నెం 1' లాంటి అనేక హిట్ సినిమాలను అందించింది.  ఎందరో నటీ నటుల్ని, దర్శకుల్ని, టెక్నీషియన్లని పరిశ్రమకు పరిచయం చేసింది.