పంత్ ను ఆ ముగ్గురు ఆటగాళ్లతో పోల్చిన రైనా...

పంత్ ను ఆ ముగ్గురు ఆటగాళ్లతో పోల్చిన రైనా...

భారత జట్టులోకి అద్భుతమైన అరంగేట్రం చేసిన తరువాత, రిషబ్ పంత్ తన పేలవమైన ఫామ్ కారణంగా గత సంవత్సరంలో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. అయినప్పటికీ యువ వికెట్ కీపర్-బ్యాట్స్మాన్ జట్టు మేనేజ్మెంట్ మరియు సీనియర్ ఆటగాళ్ళ నుండి మద్దతు పొందుతున్నాడు. పంత్‌కు మద్దతు ఇచ్చిన తాజా క్రికెటర్ భారత బ్యాట్స్‌మన్ సురేష్ రైనా. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో మాట్లాడుతూ, పంత్‌ను మాజీ విధ్వంసక బాట్స్మెన్ వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్‌లతో పోల్చారు. "అతను బాగా ఆడేటప్పుడు అతను స్టార్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్ మరియు సెహ్వాగ్ ను గుర్తుచేస్తాడు, అతను వారిలాగే ఆధిపత్యం కలిగి ఉన్నాడు" అని రైనా అన్నారు. అలాగే "అతను ఫ్లిక్ షాట్ ఆడుతున్నప్పుడు, తాను  రాహుల్ ద్రవిడ్ ను కూడా గుర్తు చేస్తాడు" అని రైనా చాహల్‌తో అన్నారు. భారతదేశం యొక్క చివరి పరిమిత ఓవర్ల మ్యాచ్లలో కెఎల్ రాహుల్ వికెట్ల వెనుక నిలుచున్నాడు. తద్వారా రిషబ్ పంత్ స్థానాన్ని మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మాన్ మనీష్ పాండే దక్కించుకున్నాడు.  అయితే ఇటీవల భారత ఓపెనర్ రోహీహ్ శర్మ కూడా పంత్ కి మద్దతు  ఇచ్చిన విషయం తెలిసిందే.