కరోనా కారణంగా జిమ్స్ బంద్... అందువల్ల వర్కవుట్ కోసం రైనా ఇలా..?

కరోనా కారణంగా జిమ్స్ బంద్... అందువల్ల వర్కవుట్ కోసం రైనా ఇలా..?

మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకేఒక పేరు కరోనా. ఈ వైరస్ కారణంగా అని కార్యక్రమాలు ఆగిపోయాయి. కరోనా ప్రభావం అని రంగాల పైనా పడుతుంది. అందువల్ల ఇప్పటికే ఐపీఎల్ అలాగే అంతర్జాతీయ టోర్నీలు వాయిదాపడ్డాయి. అయితే ఐపీల వాయిదా పడడంతో ప్రాక్టీస్ కోసం వచ్చిన ఆటగాలందరు వారి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇంట్లోనే ఖాళీగా ఉంటె ఫిట్‌నెస్ దెబ్బతింటుందనే భయంతో జిమ్స్ కి వేలాలనుకుంటే కరోనా కారణంగా జిమ్స్ అని మూతపడ్డాయి. అందువల్ల వర్కవుట్ కోసం రైనా నేచురల్ పద్ధతిని ఎనుకున్నాడు. పచ్చని ప్రకృతిలో చెట్ల మధ్య వర్కవుట్స్ చేస్తున్నాడు. ఒక చెట్టుకు బెల్ట్ కట్టి జిమ్ చేస్తున్న వీడియోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేశాడు రైనా. ఆ వీడియో తో పాటు " జిమ్స్ లేకపోయినంత మాత్రాన... వర్కవుట్ చేయడం ఆపేస్తామా...? అని కామెంట్ పోస్ట్ చేసాడు. అయితే పోస్ట్  చేసిన కొద్దీ సేపటికే ఆ వీడియో వైరల్ గా మారింది.