జ్యోతిక విషయంలో బాధపడుతున్న సూర్య

జ్యోతిక విషయంలో బాధపడుతున్న సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య ఈమధ్య వైద్య విద్యా ప్రవేశపరీక్ష నీట్ జరిగే విధానం సరిగా లేదని  వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఆయనపై పలువురు కొందరు వ్యక్తులు పనిగట్టుకుని మరీ సూర్య మీద విమర్శలకు దిగారు.  ఏ అర్హత ఉందని సూర్య నీట్ గురుంచి మాట్లాడతారంటూ మండిపడ్డారు.  ఒకానొక దశలో వివాదానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు.   సూర్య సతీమణి జ్యోతిక కొత్త చిత్రం 'రాట్చసి'ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు.

ఈ వ్యవహారం సూర్యను తీవ్రంగా బాధించింది.  దీంతో స్పందించిన ఆయన 'నీట్‌ గురించి మాట్లాడే అర్హత నాకు లేదంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను.  విద్యావ్యవస్థలో ఉన్న ఇబ్బందులపై మాట్లాడితే నన్ను టార్గెట్‌ చేయడం బాధకలిగించింది.  జ్యోతిక సినిమాను నిరసన కారులు అడ్డుకోవడం సరైంది కాదు.  జాతీయ పౌరుడిగా మాట్లాడే అర్హత నాకు ఉంది' అన్నారు.