సూర్య గెటప్స్ మాములుగా లేవు ....

సూర్య గెటప్స్ మాములుగా లేవు ....

సూర్య హీరోగా చేస్తున్న కాప్పన్ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయింది.  కాప్పన్ ఎలా ఉంటుందో అంతా అనుకుంటే అంతకు మించే విధంగా ఉండటం విశేషం.  ఇందులో సూర్య నాగలి పట్టి పొలం పండించే రైతుగా కనిపిస్తాడు.  ఆ వెంటనే ఒక తీవ్రవాదిలా మారి ప్రభుత్వ ఆస్తులను ద్వాంసం చేస్తూ కనిపిస్తుంటాడు.  గోవులను కాసే వ్యక్తిగా కనిపిస్తూ..  రైళ్లను పేల్చే వ్యక్తిగా కనిపిస్తాడు.  ఎందుకు ఇలా రకరకాల గెటప్స్ లో సూర్య కనిపిస్తాడు.  ఎందుకు ప్రభుత్వ ఆస్తులను ద్వాంసం చేస్తుంటాడు అన్నది మెయిన్ కథ.  

రంగం సినిమా ఎలాగైతే క్యూరియాసిటీని క్రేజ్ ను పెంచిందో... ఈ సినిమా కూడా అంతకు మించే విధంగా ఉంటుందని దర్శకుడు కెవి ఆనంద్ అంటున్నాడు.  ఆగష్టులో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సూర్యతో పాటు ఇందులో ఆర్య, సాయేషాలు నటిస్తున్నారు.  మోహన్ లాల్, బోమన్ ఇరానీలు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.