త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది...

త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది...

టాలీవుడ్ లో టాప్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.  త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అందరికి ఉంటుంది.  కొందరికే అది సాధ్యం అయ్యింది.  మహేష్, పవన్, అల్లు అర్జున్, ఇప్పుడు మెగాస్టార్ ఇలా టాప్ హీరోలతో ఆయన సినిమాలు చేస్తున్నాడు.  త్రివిక్రమ్ కు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు.  కోలీవుడ్ హీరో సూర్య త్రివిక్రమ్ తో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు.  

కథా పరమైన చర్చలు జరుగుతున్నాయి.  అయినప్పటికీ ఇంకా సినిమా ఫిక్స్ కాలేదు.  త్రివిక్రమ్ తో సినిమా తప్పకుండా ఉంటుందని అంటున్నాడు సూర్య.  జగన్ పదేళ్ళపాటు చాలా కష్టపడ్డాడని, దానికి తగిన ఫలితం వచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడని అన్నారు సూర్య.  ఎన్జీకె ప్రమోషన్స్ కోసం సూర్య హైదరాబాద్ వచ్చారు.  ఈ సందర్భంగా సూర్య మీడియాతో ముచ్చటించారు.