సూర్య.. ఆ 9 కోట్ల భారం మీదే !

సూర్య.. ఆ 9 కోట్ల భారం మీదే !

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.  ఆయన సినిమాలు కోసం ఎదురుచూసే అభిమానాలు ఇక్కడ కూడా ఉన్నారు.  అందుకే ఆయన నటించిన తాజాగా చిత్రం 'ఎన్.జీ.కే' తెలుగు బిజినెస్ బాగానే జరిగింది.  జరిగిన బిజినెస్ వెనక్కి రావాలంటే చిత్రం 9 కోట్ల షేర్ వసూలు చేయాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  అంటే మొదటిరోజు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి కనీసం వారం పాటు మంచి రన్ కనబర్చాలి.  ఇకపోతే సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రేపు 31వ తేదీన విడుదలచేయనున్నారు.