రియాల్టీ షో లో బాబాయ్ , అబ్బాయ్

రియాల్టీ షో లో బాబాయ్ , అబ్బాయ్

దగ్గుపాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో దర్శకుడు ప్రభుసోల్మన్ తో ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామా `అరణ్య ` తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఏకంగా 5 భాషల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా ఉంది. అరణ్య షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది.అయితే సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాల్సి ఉంది. థియేటర్లు మూతబడటంతో సినిమా ఇన్నాళ్లు ప్రేక్షకుల ముందుకు రాలేదు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే విక్టరీ వెంకటేష్ తో కలిసి సినిమా చేయాలని రానా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. నాగచైతన్య తో వెంకటేష్ వెంకీ మామ అనే సినిమా చేసాడు. మంచి కథ దొరికితే వెంకటేష్ రానా కలిసి సినిమా చేయాలని చూస్తున్నారు. త్వరలో రానా వెంకటేష్ కలిసి నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు ముందే ఈ ఇద్దరు కలిసి ఓ రియాల్టీ కలిసి కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ కోసం నిర్వహించబోతున్న రియాల్టీ షో లో రానా మరియు వెంకటేష్ లు కలిస పాల్గొంటారు అంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాని త్వరలోనే సినిమా కంటే ముందు బాబాయి అబ్బాయిని కలిసి ఓటీటీ ప్లాట్ ఫామ్ పై చూస్తామని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.