ఆ సాగును డ్రోన్లు ఇట్టే పట్టేస్తాయి

ఆ సాగును డ్రోన్లు ఇట్టే పట్టేస్తాయి

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై ఆర్టీజీఎస్ డ్రోన్ లో నిఘా పెట్టింది. పాడేరు, హుకుంపేట‌, పెద‌బ‌య‌లు, మంచిగిప‌ట్టు మండ‌లాల్లో గంజాయి తోట‌లు జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఈ నాలుగు మండ‌లాల్లో విస్తృతంగా స‌ర్వే చేపట్టింది. ఇప్పటికే ప‌లు ప్రాంతాల్లో తోట‌ల‌ను గుర్తించారు. అట‌వీ ప్రాంతం మ‌ధ్యలో ఎలాంటి అనుమానం రాకుండా వేలాది ఎక‌రాల్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు డ్రోన్ కెమెరాలు గుర్తించాయి. గంజాయి తోట‌లు ఎక్కడ సాగు చేస్తున్నా వాటిని ఇట్టే ప‌సిగ‌ట్టి తొల‌గించేలా ప్రభుత్వం డ్రోన్ నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో మ‌న్యం అట‌వీ ప్రాంతాల‌ను ఆర్టీజీఎస్ జల్లెడ ప‌డుతోంది. ఎత్తైన కొండల్లో  తోట‌ల‌ు సాగు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గంజాయి తోట‌ల ధ్వంసం చేశారు.