స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఈ నగరాలే టాప్‌..

 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఈ నగరాలే టాప్‌..

పారిశుధ్య నిర్వహణలో ఉత్తమంగా నిలిచిన పట్టణాలు, నగరాలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 అవార్డులను ప్రకటించింది. మొత్తం మూడు కేటగిరీల్లో ఉత్తమ నగరాలను ఎంపిక చేసింది. 

  • జనాభాతో సంబంధం లేకుండా ఎంపిక చేసిన ఉత్తమ నగరాల కేటగిరీలో ఇండోర్ - భోపాల్‌ ప్రథమ స్థానం సాధించగా అంబికాపూర్‌ (ఛత్తీస్‌గఢ్‌) రెండో స్థానంలో, మైసూర్‌ మూడో స్థానంలో నిలిచాయి.
  • 10 లక్షలు దాటిన జనాభా కేటగిరీలో అహ్మదాబాద్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. రాయ్‌పూర్‌, నవీ ముంబై, జబల్‌పూర్‌, సూరత్‌.. 2, 3, 4, 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి
  • 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో ఉజ్జయిని (మధ్యప్రదేశ్‌), మధురాబృందావన్‌ (యూపీ), చంద్రాపూర్‌, ఝాన్సీ, లాథూర్‌ (మహారాష్ట్ర) మొదటి 5 స్థానాల్లో నిలిచాయి.