తనను సస్పెండ్‌ చేసే అధికారం వారికి లేదు

తనను సస్పెండ్‌ చేసే అధికారం వారికి లేదు

తాను సోనియాకు విధేయుడిని, ఏఐసీసీ సభ్యుడిని, కేంద్ర మాజీ మంత్రినని సర్వే సత్యనారాయణ తెలిపారు. తనను సస్పెండ్ చేసే అధికారం పీసీసీలో లేదని స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి చెందిందని ఆరోపించారు. మళ్లీ వాళ్లే సమీక్ష చేయడాన్ని ప్రశ్నించానని, అధిష్టానం వీళ్లకు సమీక్ష చేయమని చెప్పలేదన్నారు. నాపైకి రౌడీ మూకలను పంపారని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగించిన వాళ్లే రివ్యూలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఉత్తమ్, కుంతియా టికెట్లు అమ్ముకుని, టీఆర్ఎస్ కు కోవర్టులుగా వ్యవహరించారని మండిపడ్డారు. పూర్తి ఆధారాలతో అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి వీళ్ల భరతం పడతానని సర్వే సత్యనారాయణ హెచ్చరించారు.