ఫస్ట్ లుక్ తో పలకరించిన సూర్య

ఫస్ట్ లుక్ తో పలకరించిన సూర్య

ఫస్ట్ లుక్ తో పలకరించిన సూర్య

తమిళ నటుడు సూర్య ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది తన కెరియర్లో 36వ సినిమా తెరకెక్కుతోంది. కొద్దీ సేపటి క్రితమే చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ను టైటిల్ ను రిలీజ్ చేశారు. NGK అనే వైవిధ్యమైన టైటిల్ తో స్కెచ్ పెయింటింగ్ తో సూర్య మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఎన్జికే అనేది సినిమాలోని సూర్య పాత్ర పేరని తెలుస్తోంది.

ఈ NGK షూటింగ్ ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలోనే అంబసముద్రం సెట్స్ లో మూడో షెడ్యూల్ ప్రారంభం కానుందని తమిళ మీడియా చెప్తోంది. ఇక మే నాటికి దాదాపు టాకీ పార్ట్ షూట్ కంప్లీట్ చేసి..పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనుంది. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఆల్రెడీ రెండు పాటలను కంపోజ్ చేయగా, త్వరలో సూర్య ఇంట్రో సాంగ్ ను కంపోజ్ చేసి షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ ప్రీత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గతంలో సెల్వ రాఘవన్ తెరకెక్కించిన సినిమాలన్నీ ట్రెండ్ సెట్టింగ్ గా నిలవడంతో..ఇప్పుడు సూర్యతో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా దీపావళీకి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.