సింగం కాంబినేషన్... మళ్లీ రిపీట్..!!

సింగం కాంబినేషన్... మళ్లీ రిపీట్..!!

సింగం సీరీస్ లో మూడు సినిమాలు వచ్చాయి.  ఈ మూడు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ మూడు సీరీస్ కు యాక్షన్ చిత్రాల దర్శకుడు హరినే దర్శకత్వం వహించారు.  ఇప్పుడు ఇదే దర్శకుడు మరోసారి సింగం కాంబినేషన్లో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.  అయితే, ఇది సింగం సీక్వెల్ కాదట.  పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దబోతున్నాడట దర్శకుడు హరి.  ఇప్పటికే ఈ స్టోరీని హీరో సూర్యకు వినిపించాడు.  హరితో సినిమా చేసేందుకు సూర్య సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.  ఇదే స్టోరీని అనుష్కకు కూడా చెప్పాడట హరి. అనుష్క నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదట.  సూర్య .. అనుష్క జోడి అయితే బాగుంటుందని హరి పట్టుబడుతున్నాడు.  మరి అనుష్క ఈ సినిమాపై ఏం జవాబిస్తుందో చూడాలి.