హరి - సూర్య కాంబినేషన్ క్యాన్సిల్ అవ్వలేదట !

హరి - సూర్య కాంబినేషన్ క్యాన్సిల్ అవ్వలేదట !


సూర్యని వరుస ఫ్లాప్ లు ఇబ్బంది పెడుతున్నాయ్. అయినా అతడు ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమాలకు కమిటవుతూ వెళ్తూన్నాడు. తమిళ్- తెలుగు ద్విభాషా చిత్రాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నాడు. మొన్న `కాప్పాన్` అనే భారీ మల్టీస్టారర్ రిలీజ్ చేసినా అది కూడా దెబ్బెసింది. దీంతో ఆయన సుధ కొంగర దర్శకత్వంలో `సూరరై పోట్రు` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్.గోపీనాథ్ బయోపిక్ అని ప్రచారం అవుతోంది. అలాగే అజిత్ కి విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన `దరువు` శివకు ఓ సినిమా చేస్తానని ఆఫర్ ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. అవి కాక ఈలోగానే `సింగం` సిరీస్ దర్శకుడు హరికి సూర్య ఓకే చెప్పారని, ఈ సినిమాని సొంత బ్యానర్ 2డి ఎంటర్ టెయిన్ మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది.

అయితే  హరి తెరకెక్కించిన `సింగం` ఫ్రాంఛైజీలో తొలి రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించినా మూడో చిత్రం మాత్రం ఫెయిలైంది. అందుకే ఈసారి కథ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది. హరి అంటే భారీ యాక్షన్ కాప్ డ్రామాల స్పెషలిస్ట్. అయితే మళ్ళీ ఎందుకో ఈ కాంబినేషన్ క్యాన్సిల్ అయ్యిందని సూర్య ప్లేస్ లో శింభు నటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేదని ఈ సినిమా క్యాన్సిల్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చేశాడు ఆయన తమ్ముడు కార్తీ. ఆయన 'ఖైదీ' సినిమా చేశాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిన్న ఆ ఈవెంట్ లో పాల్గొన్న కార్తీ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు.