ప్రభాస్ తో పోటీ పడుతున్న సూర్య..!!

ప్రభాస్ తో పోటీ పడుతున్న సూర్య..!!

బాహుబలి 2 తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో.  బాహుబలి వచ్చి ఇప్పటికే రెండేళ్లు దాటింది.  ఇంకా ప్రభాస్ నెక్స్ట్ సినిమా రిలీజ్ కాకపోవడం విశేషం.  సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ.300 కోట్ల  రూపాయల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తోంది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ తప్పించి మరేదీ రిలీజ్ చేయలేదు. సినిమాను ఈ ఏడాది ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.  

తమిళంలో రంగం సినిమాతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు ఆనంద్.  ప్రస్తుతం ఆనంద్ సూర్యతో కాప్పన్ అనే సినిమా చేస్తున్నాడు.  మలయాళం నటుడు మోహన్ లాల్ ప్రధానిగా నటిస్తున్నాడు.  మోహన్ లాల్ కు ప్రధాన సెక్యూరిటీ ఆఫీసర్ గా సూర్య కనిపిస్తున్నాడు.  యాక్షన్, దేశభక్తి నిండిన కథతో సినిమా తెరకెక్కుతోంది.  సయేషా హీరోయిన్.  టాలీవుడ్ లో అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ గా నటించిన ఆర్య, కాప్పన్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.  దేశభక్తితో నిండిన సినిమా కావడంతో దీనిని కూడా ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.