సూర్య కాప్పన్ టీజర్ రెడీ

సూర్య కాప్పన్ టీజర్ రెడీ

సూర్య హీరోగా చేస్తున్న కాప్పన్ సినిమా కోసం తమిళ్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో సూర్య  కమాండర్ గా నటిస్తున్నారు.  కెవి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.  తమిళ న్యూ ఇయర్ సందర్భంగా రేపు అంటే ఏప్రిల్ 14 వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  14 వ తేదీ సాయంత్రం 7 గంటలకు టీజర్ రిలీజ్ కాబోతున్నది.  

ప్రస్తుతం సూర్య ఈ సినిమాతో పాటు ఎంజీకే సినిమా చేస్తున్నాడు.  పొలిటికల్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది.  కాగా, కాప్పన్ లో సాయేషా మెయిన్ ఫిమేల్ లీడ్ చేస్తుంటే.. ఆర్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఆగష్టులో సినిమాను రిలీజ్ చేస్తారు.