కోహ్లీ నాయకత్వంలో ఆడాలనేది నా కల : సూర్యకుమార్‌

కోహ్లీ నాయకత్వంలో ఆడాలనేది నా కల : సూర్యకుమార్‌

టీమ్‌ఇండియా సారథి విరాట్‌కోహ్లీ నాయకత్వంలో ఆడాలని సుదీర్ఘకాలంగా తాను కలగన్నానని యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అంటున్నాడు. విరాట్‌ను తాను ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు హార్దిక్‌ను అడిగి విరాట్‌ గురించి తెలుసుకొనేవాడినని వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసుకు ఎంపికైన సూర్యకుమార్‌ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జట్టుతో కలిసి ఉంటున్నాడు. జట్టు వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, దేశవాళీ క్రికెట్లో అతడు నిలకడగా పరుగుల వరద పారించాడు. ఇప్పటికి అతడికి జట్టులో చోటు దొరకడం గమనార్హం.