'దుర్గ' చీరెక్కడుందో ఆ నలుగురికీ తెలుసు..

'దుర్గ' చీరెక్కడుందో ఆ నలుగురికీ తెలుసు..

విజయవాడ దుర్గా గుడిలో చీర మాయం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవస్ధాన పాలక మండలి మాజీ సభ్యురాలు సూర్యలత ఎట్టకేలకు స్పందించారు.  దుర్గ గుడి పాలక మండలి ఛైర్మన్ గౌరంగ బాబు, సభ్యుడు వెలగపూడి శంకర్ బాబు, వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్యా, పూజారి రమేష్‌కు కూడా చీర మాయం విషయం తెలుసని ఆమె చెప్పారు. ఈ నలుగురిని ఒకే వేదిక మీద ఉంచి.. ప్రశ్నిస్తే చీర విషయం బయటకు వస్తుందని చెప్పారు. రూ. 50 లక్షల విలువైన చీరలు ఇప్పటి వరకు మాయమయ్యాయని నెల రోజుల క్రితమే నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. పాలక మండలి సభ్యురాలిగా ఎన్నో కోట్లాది రూపాయల వ్యవహరాలు చూసిన తాను రూ. 18వేల చీరను దొంగిలిస్తానా..? అని సూర్యలత అన్నారు.