జయరామ్‌ హత్య కేసులో సినీ నటుడు అరెస్ట్‌

జయరామ్‌ హత్య కేసులో సినీ నటుడు అరెస్ట్‌

పారిశ్రామిక వేత్త, కోస్టల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసు ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. ఈ  కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నటుడు సూర్యప్రసాద్‌తోపాటు సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డి, కిశోర్‌లను జూబ్లీహిల్స్‌ పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రాకేష్‌ ఇంట్లో జయరామ్‌ మృతదేహాన్ని చూసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వని కారణంగా వీరిని అరెస్టు చేసినట్టు తెలిసింది. వీరిని నేడు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.