బీజేపీతోనే తెలంగాణ నిర్మాణం

బీజేపీతోనే తెలంగాణ నిర్మాణం

బీజేపీ గెలుపుతోనే తెలంగాణ నిర్మాణం జరగదని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమాజం కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది గానీ, కేసీఆర్‌ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తుల కోసం ఏర్పడలేదన్నారు. ఇక్కడి యువతకు ఉద్యోగాలు రాలేదుగానీ.. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మాత్రం వచ్చాయని ఎద్దేవాచేశారు. 2 వేల మంది యువత బలిదానం చేసుకుంటే కేసీఆర్‌ ప్రభుత్వం 400 మందినే గుర్తించిందన్నారు. రాష్ట్రం కోసం యువత చేసిన బలిదానాలను కూడా గుర్తించలేని పరిస్థితిలో కేసీఆర్‌ ఉన్నారని సుష్మా స్వరాజ్ విమర్శించారు.