విజయవాడ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్?

విజయవాడ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్?

విజయవాడలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కలకలం రేగింది. మతిస్థిమితం లేని ఓ యువకుడు సింగ్ నగర్ లో యువతి స్నానం చేస్తుండగా ఇంట్లోకి చొరబడ్డాడు. స్థానికులు అప్రమత్తమై ఆ యువకుడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని విచారణ కోసం స్టేషన్ కు తీసుకువచ్చారు. మధ్యాహ్నం లాకప్ లో చనిపోయాడు. నిందితుడి నుంచి నిజం రాబట్టేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు మాత్రం ఆ యువకుడు లాకప్ లో ఉరివేసుకుని చనిపోయినట్లు చెబుతున్నారు. దీంతో పోస్టు మార్టం నిమిత్తం పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.