చెన్నైలో ఐసిస్ అనుమానితులు అరెస్ట్

చెన్నైలో ఐసిస్ అనుమానితులు అరెస్ట్

చెన్నైలో ముగ్గురు ఐసిస్ అనుమానితులను ఎన్‌ఐఏ బృందం అరెస్టు చేసింది. సోషల్ మీడియా ద్వారా ఐసిస్ భావజాలాన్ని వీరు వ్యాప్తి చేస్తున్నారని ఎన్‌ఐఏ బృందం గుర్తించింది. రాష్ట్రంలోపోలీసుల కళ్లు గప్పి సాగుతున్న ఐసిస్‌ వ్యవహారాలను పసిగట్టడంపై ఎన్‌ఐఏ దృష్టిపెట్టింది. దక్షిణ భారత దేశం లోని కేరళ, తమిళనాడులో విధ్వంసాలకు ఐసిస్‌ కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఇప్పటి వరకు ఆరుగురు అనుమనితులపై కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ.. మరో ముగ్గురి కోసం గాలిస్తోంది.