అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లోని శ్రీ సాయి లాడ్జ్ లో ఓ మహిళ అనుమానాస్పద స్ధితలో మృతి చెందింది. ఒడిషా కు చెందిన ప్రశాంత్ కుమార్, మధు సుమిత అనే దంపతులు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలు చూపిస్తానని తీసుకువచ్చి భర్త హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రశాంత్ హత్య చేస్తే... అనుమానాస్పద మృతిగా ఎలా కేసు నమోదు చేస్తారని ఆఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ఆందోళన నిర్వహించారు.