'సూత్రధార్' వినయ్ వర్మ అరెస్ట్

'సూత్రధార్' వినయ్ వర్మ అరెస్ట్

సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్‌వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. నటన నేర్చుకోవాలంటే.. బట్టలు విప్పేయాలంటూ వేధించాడని ఓ యువతి ఈ నెల 17న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. వినయ్ వర్మపై 354 A (నిర్భయ యాక్ట్) 506, 509 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించారు. 

ఏప్రిల్ 17న బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వినయ్ వర్మ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో సోదాలు నిర్వహించారు. బాధితురాలి ఆరోపణలపై వినయ్ వర్మను ప్రశ్నించగా.. బట్టలు విప్పడం నటనలో భాగమని సమర్ధించుకొన్నారు. ఆమెకు అలా చేయడం ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోమన్నాను. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 

వినయ్ వర్మ సుమారు 30 సంవత్సరాల నుంచి థియేటర్, శిక్షణ రంగంలో ఉన్నారు. ఆయన పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. 20 సంవత్సరాల నుంచి ఆయన సూత్కధార్ అనే యాక్టింగ్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. గతంలో కూడా కొందరిని వేధించారని, అయితే బయటకు పొక్కకపోవడం గమనార్హం.