బట్టలు విప్పితేనే నటన! యాక్టింగ్‌ స్కూల్ యజమాని అరెస్ట్..

బట్టలు విప్పితేనే నటన! యాక్టింగ్‌ స్కూల్ యజమాని అరెస్ట్..

తమ దగ్గర నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పేయాల్సిందేనంటూ తొమ్మిది మంది యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో సూత్రధార్‌ యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మను అరెస్ట్ చేశారు నారాయణగూడ పోలీసులు... నటన నేర్చుకోవడానికి వెళ్తే బట్టలు విప్పేయమన్నారంటూ ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ యజమానిని అరెస్ట్ చేశారు. నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలంటూ ఇప్పటి వరకు 9 మంది యువతులతో వినయ్‌ వర్మ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలున్నాయి. ఇక వినయ్ వర్మపై సెక్షన్ 354 A(నిర్భయ యాక్ట్) 506, 509 ఐపీసీ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు... ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.