సుజుకి నుంచి కొత్త స్కూటర్‌

సుజుకి నుంచి కొత్త స్కూటర్‌

బర్గ్‌మ్యాన్‌ స్ర్టీట్‌ పేరుతో 125 సీసీ స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది సుజుకి. గేర్‌ లేని ఈ స్కూటర్‌ ధర ఢిల్లీలో రూ. 68,000 (ఎక్స్‌ షో రూమ్‌).  సుజుకి యాక్సెస్‌ 125లో ఉపయోగించిన ఇంజిన్‌నే దీనికి వాడినట్లు సుజుకీ ఇండియా లిమిటెడ్‌ వెల్లడించింది.125 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన గల  ఈ స్కూటర్‌ లీటర్‌కు 35 నుంచి 40 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.రూ.5000 చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని, ఇప్పటికే బుకింగ్స్‌ మొదలయ్యాయని కంపెనీ పేర్కొంది.