మరో వివాదంలో పృథ్వీరాజ్.. రాసలీలల వ్యవహారం వైరల్...

మరో వివాదంలో పృథ్వీరాజ్.. రాసలీలల వ్యవహారం వైరల్...

ఇప్పటికే రాజధాని రైతుల విషయంలో నోరు జారి వివాదాల్లో చిక్కుకున్న ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్... ఇప్పుడు ఓ మహిళా ఉద్యోగితో రాసలీలల వ్యవహారం కాస్త వైరల్‌గా మారిపోయింది. సదరు మహిళా ఉద్యోగిని, పృథ్వీరాజ్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధిచిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది... రైతుల వ్యవహారంలో పృథ్వీని పోసాని కృష్ణ మురళి టార్గెట్ చేయగా... దీంతో సీఎం వైఎస్ జగన్‌ కూడా పృథ్వీపై సీరియస్ అయినట్టు సమాచారం. ఇదే సమయంలో ఇప్పుడు ఆడియో బయటకు రావడంతో.. పృథ్వీ భవిష్యత్ ఏంటి? అనే చర్చ సాగుతోంది. మహిళా ఉద్యోగినితో తన స్థాయిని మరిచి అసహ్యంగా మాట్లాడిన పృథ్వీ.. నేను గుర్తుకు వస్తున్నానా? నువ్వంటే ఇష్టం.. నా గుండెల్లో ఉన్నావ్.. నిన్ను వెనక్కి నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకుందాం అనుకున్నా.. లవ్యూ.. ఇలా సదరు మహిళా ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది.. అంతే కాదు.. తాగి మాట్లాడుతున్నారేనన్న సందేహాన్ని మహిళ వ్యక్తం చేయగా.. తాను ప్రస్తుతం మద్యం సేవించడం లేదు.. మళ్లీ తాగడమంటూ జరిగితే నీవద్దే కూర్చొని తాగుతానంటూ... ఆ ఆడియో టేపుల్లో బయటపడింది.