జగన్‌కు స్వరూపానంద శుభాకాంక్షలు..

జగన్‌కు స్వరూపానంద శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం వైపు దూసుకుపోతోంది. ఈ నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు. ఇక ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయంవైపు దూసుకెళ్తున్న వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు స్వామి స్వరూపానంద. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడిన స్వరూపానంద... శుభాకంక్షలు తెలియజేశారు. మంచి పాలన అందించాలని దీవెనలు అందించారు. ఈ సందర్భంగా... ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని స్వారూపానందను ఆహ్వానించారు వైఎస్ జగన్.