టీడీపీ ప్రభుత్వంపై స్వరూపానందేంద్ర విమర్శలు

టీడీపీ ప్రభుత్వంపై స్వరూపానందేంద్ర విమర్శలు

గత టీడీపీ ప్రభుత్వంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. సంహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఇవాళ స్వరూపానందేంద్ర దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలు, నదీ హారతులు, పథకాల పేరుతో  గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై విచారణ చేయించాలని శారదా పీఠం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరుతానని చెప్పారు.