ఎన్టీవీ చైర్మన్ ను సన్మానించిన శారదా పీఠాధిపతి

ఎన్టీవీ చైర్మన్ ను సన్మానించిన శారదా పీఠాధిపతి

శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌ శర్మ (కిరణ్‌ బాలస్వామి) సన్యాసాశ్రమ దీక్ష స్వీకరణ మహోత్సవ సందర్భంగా ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఘనంగా సన్మానించారు. కోటి దీపోత్సవం అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన మహానుభావుడు నరేంద్ర చౌదరి అని ఆయన ప్రశంసించారు. స్వరూపానంద ఆయనకు దుశ్శాలువ కప్పి సత్కరించారు. పీఠం తరఫున అనుగ్రహ ప్రసాదాన్ని అందజేశారు.

స్వాత్మానందేంద్ర సరస్వతికి తురీయాశ్రమ దీక్ష సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి తదితర ప్రముఖులు హాజరయ్యారు.స్వాత్మానందేంద్ర సరస్వతికి ఇరు రాష్ట్రాల సీఎంలు కిరీటధారణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రయోక్తగా ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ వ్యవహరించారు.