స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన

స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన

తమకు ఇచ్చే కమీషన్‌ను తగ్గించారంటూ స్విగ్గి డెలివరీ బాయ్స్‌ ఎస్ఆర్ నగర్ లో ఆందోళనకు దిగారు. కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీ చేస్తే సంస్థ ద్వారా రూ.37 చెల్లించేవారు. అదే విధంగా 7 నుంచి 10 కిలోమీటర్ల దూరానికి ఒక్కో ఆర్డర్‌కు రూ.65, 15 డెలివరీలు చేస్తే రూ.200 ఇన్సెంటివ్స్‌ ఇచ్చేవారు. అయితే గత రెండు రోజులుగా ఇన్సెంటివ్స్‌ ఇవ్వకపోగా కమీషన్‌ కూడా తగ్గించారని బాయ్స్ వాపోయారు. కమీషన్‌ను ఎప్పటిలాగే ఇవ్వాలని, ఇన్సెంటివ్స్‌ డబ్బులు యథావిధిగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డెలివరీ బాయ్స్‌ ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం నుంచి అమీర్‌పేట జోన్‌ పరిధిలోని అన్ని ఫుడ్‌ ఆర్డర్లు నిలిచిపోయాయి.