శ్యామ్ కె నాయుడు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు !

శ్యామ్ కె నాయుడు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు !

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్ కె నాయుడు పై గతంలో సినీనటి శ్రీసుధ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాంప్రమైజ్ అయినట్లు నకిలీ డాక్యుమెంట్లు , చెక్కులు , డీడీలు రూపంలో 50 లక్షలు ఇచ్చినట్లు కోర్ట్ కి సమర్పించారు శ్యామ్ కె నాయుడు. డాక్యుమెంట్లు చూసి శ్యామ్ కె నాయుడుకి నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రద్దు చేయాలంటూ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేసు సినీ నటి శ్రీసుధ వేసింది. సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత తనను చెప్పేందుకు కుట్ర చేసి , విజయవాడ లో కారు యాక్సిడెంట్ చేశారంటూ కోర్టుకి తెలిపింది శ్రీసుధ. ఈ కేసులో శ్యామ్ కె నాయుడు తో పాటు ఆయన సోదరుడు చోటకే నాయుడు కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి , శ్యామ్ కె నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.