వడదెబ్బకు 'సైరా' నటుడు మృతి !

వడదెబ్బకు 'సైరా' నటుడు మృతి !

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.  ఎండలు తీవ్రంగా ఉన్నా కూడా టీమ్ ఇబ్బందులు పడుతూనే షూటింగ్ జరుపుతున్నారు.  దీంతో సినిమాలో క్యారెక్టర్ నటుడిగా ఉన్న రష్యా దేశపు వాసి అలెగ్జాండర్ వడదెబ్బ తగిలి మంగళవారం మృతి చెందాడట.  సినిమాలో బ్రిటిష్ పాత్రల కోసం పెద్ద సంఖ్యలో విదేశీయుల్ని తీసుకొచ్చారు కాస్టింగ్ టీమ్.  వారిలో 38 ఏళ్ల అలెగ్జాండర్ కూడా ఒకరు.  అతను టూరిస్ట్ వీసా మీద రెండు నెలల క్రితం ఇండియా రావడం జరిగింది.