దర్శకుడి ఆ ఆలోచనే సైరాను నిలబెట్టిందా?

దర్శకుడి ఆ ఆలోచనే సైరాను నిలబెట్టిందా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చారిత్రాత్మక సినిమా సైరా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ సినిమా కోసం మెగాస్టార్ రెండేళ్లకు పైగా కష్టపడ్డారు.  స్వాతంత్ర సమరయోధుడు కథా కాబట్టి క్లైమాక్స్ విషాదంగానే ఉంటుంది.  అయితే, తెలుగు ప్రేక్షకులకు విషాదం అంటే నచ్చదు.  క్లైమాక్స్ ను వీలైనంతగా హ్యాపీగా ఎండ్ చేయాలి.  అప్పుడే సినిమా చూస్తారు.  కానీ, సైరా నరసింహారెడ్డి కథలో విషాదం ఉంది.  

దాని అదే విధంగా చూపిస్తే.. విషాదంగా మారుతుంది.  అందుకే దర్శకుడు కాస్త స్వేచ్ఛ తీసుకొని క్లైమాక్స్ ను విషాదంగా ముగిసినా వీరోచితంగా ముగించాలని అనుకున్నాడు.  ఆ ముగించి అందరికి నచ్చేలా ఉండాలని అనుకున్నాడు.  అందుకే సైరాను ఉరి తీసే సమయంలో వీరోచితం నింపే డైలాగులు పెట్టారు.. అదే విధంగా ఉరి తీసే సమయంలో సైరాను మెయిన్ విలన్ ను చంపించి ఉరికొయ్యలపై వేలాడే విధంగా చూపించారు.  పైగా తల నుంచి రక్తం కారుతున్న సమయంలో ఆ రక్తాన్ని ఒడిలో పట్టి వేలాది మంది వీరులను తయారు చేస్తానని సైరా తల్లి చేత చెప్పించి ప్రతి ఒక్కరిచేత క్లైమాక్స్ ను మెప్పించే విధంగా చూపించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.