సైరా రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..!!

సైరా రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..!!

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసిమహారెడ్డి పాత్రలో నటిస్తున్న సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి.  ఇక బాలీవుడ్ లో ప్రమోషన్ చేస్తున్నారు.  స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మొదటి తెలుగు స్వాతంత్ర వీరుడి కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ను ఉమైర్ సంధూ ట్విట్టర్ లో ప్రకటించారు.  సినిమా సూపర్ గా ఉందని, మేకింగ్, మెగాస్టార్ నటన, స్క్రీన్ ప్లే అన్ని సినిమాకు ప్లస్ అయ్యాయని, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొట్టటం ఖాయం అని ట్వీట్ చేశారు.  మెగాస్టార్ తో పాటు అమితాబ్, సుదీప్ లు నటనతో ఆకట్టుకున్నట్టు ఉమైర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.  డైరెక్టర్, స్క్రీన్ ప్లే, సౌండ్ ట్రాక్, అన్ని సినిమాకు ప్లస్ అయ్యాయని 4 రేటింగ్ ఇస్తున్నట్టు ఉమైర్ సంధూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే, గతంలో సాహో విషయంలో కూడా ఇలానే రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.