భారీ ధరకు అమ్ముడైన సైరా !

భారీ ధరకు అమ్ముడైన సైరా !

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'సైరా'.  సురేందర్ రెడ్డి దర్శకుడు.  ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వాటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు.  అందుకే సినిమాఫై అన్ని పరిశ్రమలోనూ అంచనాలున్నాయి.  ఈ క్రేజ్ మూలానే సినిమా హిందీ డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది.  ఎక్సెల్ సంస్థ ఈ హక్కుల్ని కొనుగోలు చేసిందట.  భారీ వ్యవయంతో నిర్మితమవుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.  అక్టోబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.