చిరు స్టామినా అదుర్స్.. హక్కులు 30 కోట్లు

చిరు స్టామినా అదుర్స్.. హక్కులు 30 కోట్లు

మెగాస్టార్ చిరు చేస్తున్న 'సైరా నరసింహారెడ్డి'పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు.  కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర రాష్ట్రాల  ప్రేక్షకులు సైతం ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎలా ఉంటుందో చూడాలని ఆశపడుతున్నారు.  అందుకే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయిలో జరుగుతోంది. 

సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం యొక్క కర్ణాటక హాక్కులు రూ.30 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది.  దీన్నిబట్టే సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థపై నిర్మిస్తున్నారు.  ఇందులో తెలుగు, తమిళ, హిందీ నటులు నటిస్తున్నారు.  ఈ మూడు భాషల్లోనూ చిత్రం ఒకేసారి అక్టోబర్ 2న విడుదలకానుంది.