సైరా మేకింగ్ వీడియో టాక్

సైరా మేకింగ్ వీడియో టాక్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్ లో మేకర్స్ రిలీజ్ చేశారు.  సినిమాలో మెయిన్ పాత్రలను పరిచయం చేస్తూ.. వార్ దృశ్యాలను షూట్ చేస్తున్న విధానం అద్భుతంగా ఉన్నది.  హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ సైతం ఈ సినిమాకు పనిచేశారు.  వందలాది మంది టెక్నిషియన్లు ఈ సినిమా కోసం పనిచేసినట్టు వీడియో చూస్తుంటే అర్ధం అవుతున్నది.  మూవీలో అందరి కృషిని చూపించాలనే ఉద్దేశ్యంతో ముందుగా ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది.