సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..!!

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..!!

సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరిదశకు చేరుకున్నాయి.  వచ్చే నెల రెండో తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా టీజర్ మాత్రమే ఇప్పటి వరకు రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న సమయంలో ప్రమోషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభం చేస్తారో అని ఎదురు చూస్తున్నారు.  

అయితే, తాజా సమాచారం ప్రకారం ఈనెల 18 వ తేదీన సినిమా ప్రమోషన్ ను షురూ చేయబోతున్నారని తెలుస్తోంది.  ఈనెల 18 వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.అయితే, ఈ విషయం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయాల్సి ఉన్నది.