సైరా ప్రీ రిలీజ్...అతిధులు వారే

సైరా ప్రీ రిలీజ్...అతిధులు వారే

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కధతో తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ మీద రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, శాండిల్ వుడ్ నుండి కిచ్చా సుదీప్, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు, లాంటి స్టార్లు ఈ సినిమాలో నటించి మరింత హైప్ పెంచారు. ఇక ఈ సినిమా గాంధీ జయంతి ఆ  తర్వాత వచ్చే దసరా  బిజినెస్ బేస్ చేసుకుని అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ చిత్రానికి సంబంధించి యూనిట్ ఇంకా సరైన ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఆ మధ్య ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ప్రమోషన్స్ కిక్‌స్టార్ట్ చేయలేదు. దీంతో సినిమా వాయిదా పడచ్చనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ వేడుకను ఈ నెల 18వ తేదీన హైదరాబాద్, లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అంతేకాక ప్రత్యేక అతిథులుగా కేటీఆర్, పవన్ కల్యాణ్, రాజమౌళి, శివ కొరటాల, వీవీ వినాయక్ విచ్చేస్తారని కూడా సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది.