ఆ 8 నిమిషాల కోసమే.. రూ.54 కోట్లు ఖర్చు..!!

ఆ 8 నిమిషాల కోసమే.. రూ.54 కోట్లు ఖర్చు..!!

సైరా షూటింగ్ జార్జియాలో భారీ ఎత్తున జరుగుతున్నది.  ఇండియా నుంచి 160 మంది బృందం జార్జియా వెళ్ళింది.  అక్కడ 600 మంది లోకల్ నటులను ఈ సినిమా కోసం వినియోగించుకుంటున్నారు.  విశాలమైన ఖాళీ ప్రదేశంలో సెట్స్ వేసి షూట్ చేస్తున్నారట.  40 రోజులపాటు పోరాటానికి సంబంధించిన షూట్ జరగబోతున్నది.  

40 రోజులపాటు షూట్ చేయబోతున్న ఈ షూట్ మొత్తం కేవలం 8 నిమిషాల ఎపిసోడ్ కోసమేనట.  జార్జియా షూట్ కోసం నిర్మాత రామ్ చరణ్ దాదాపుగా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.  అంటే కేవలం 8 నిమిషాల ఎపిసోడ్ కోసం రూ.50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నమాట.  ఇంతటి భారీ ఖర్చుతో షూట్ చేస్తున్న ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.