సైరా రిలీజ్ డేట్ ఫిక్స్

సైరా రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  క్లైమాక్స్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేసే సెట్స్ అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సైరా రిలీజ్ ఎప్పుడు అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి.  స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ చేస్తారని కొందరు, లేదు దసరాకు వస్తుందని కొందరు.. కాదు కాదు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. 

వీటికి చెక్ పెడుతూ సైరా రిలీజ్ డేట్ వచ్చింది.  గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  మిగిలిన కొద్దిపాటి షూట్ ను కంప్లీట్ చేసి, నిర్మాణాంతర కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నది యూనిట్.  మెగాస్టార్ తో పాటు అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, నయనతార తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.  రామ్ చరణ్ నిర్మాత.  సురేందర్ రెడ్డి దర్శకుడు.