సైరా డేట్ ఫిక్స్...

సైరా డేట్ ఫిక్స్...

మెగాస్టార్ హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కోకాపేటలో చేసే షూటింగ్ తో సినిమా పూర్తవుతుంది.  భారీ బడ్జెట్ తో పాటు చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.  సినిమా రిలీజ్ డేట్ విషయంలో అనేక డేట్స్ అనుకున్నా ఫైనల్ గా అక్టోబర్ 2 వ తేదీని ఫైనల్ గా ఫిక్స్ చేశారు.  అక్టోబర్ 8 న విజయ దశమి కావడంతో ఆ సెలవులను క్యాష్ చేసుకోవడానికి అక్టోబర్ 2 వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నారు.  

మెగాస్టార్ తో పాటు అమితాబ్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార తదితరులు నటిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.  స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో పాటు మెగాస్టార్ మొదటిసారి ఇలాంటి పాత్ర చేస్తుండటం విశేషం.