సైరాకు గుమ్మడికాయ కొట్టేశారు..!!

సైరాకు గుమ్మడికాయ కొట్టేశారు..!!

ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ ఫ్యాన్స్ కలలు ఫలించాయి.  ఎట్టకేలకు సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.  సినిమా షూటింగ్ పూర్తయినట్టు సైరా కెమెరామెన్ రత్నవేలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.  

సైరా షూటింగ్ కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డారు యూనిట్.  రెండేళ్ల శ్రమ ఎట్టకేలకు పూర్తయింది.  యూనిట్ కన్న కలలు తీరిపోయాయి. షూటింగ్ పూర్తికావడంతో.. యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ మీద దృష్టిపెట్టింది.  వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేయాలని యూనిట్ సంకల్పించింది.  ఆగష్టు 22 వ తేదీన సైరా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు.  అలాగే అక్టోబర్ 2 వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.